- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..
దిశ,ఏటూరునాగారం : నిషేదిత గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నూగూరు వెంకటాపురం సీఐ బి.కూమార్ ఆదివారం రోజున వెంకటపురం మండల కేంద్రంలోని పోలిస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా పోలిసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిషేదిత గంజాయిని కొంత మంది వ్యక్తులు నూగురు వెంకటాపురం గ్రామ శివాలయం శివారు మీదుగా తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అ ప్రాంతంలో పోలిసులు నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. కాగా పట్టుబడిన వ్యక్తుల వద్ద నుండి 3కేజీల 654 గ్రాముల గంజాయినీ స్వాధీనం చేసుకున్నామని స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ రూ.92,375 ఉంటుందని తెలిపారు. కాగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గోగుబాక, నెల్లిపాక, యటిపాకి గ్రామాలకు చెందిన చింత నాగేంద్ర ప్రసాద్, తిరూవీదుల ప్రవీణ్, కనకం దుర్గా ప్రసాద్ గా గుర్తించామని, గంజాయి తరలిస్తూ పట్టుబడిన వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి కూమార్ తెలిపారు.