అతివేగంతో అదుపుతప్పి గుంతలో పడిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Shiva |   ( Updated:2024-03-25 09:13:23.0  )
అతివేగంతో అదుపుతప్పి గుంతలో పడిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, నిజాం సాగర్: నిజాం సాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారి 161‌పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై కే.సుధాకర్ కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యాపారులు వ్యక్తిగత పనుల నిమిత్తం మహారాష్ట్రకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కారు నిజాంసాగర్ మండల పరిధిలోని నర్సింగరావు పల్లి గేటు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జాతీయ రహదారి అంబులెన్స్ 1033లో సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆసుపత్రికి తరలించినట్లుగా ఎస్సై సుధాకర్ తెలిపారు.

Advertisement

Next Story