ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.. ఇల్లు కూలి ఒకరికి గాయాలు

by Sumithra |   ( Updated:2024-09-01 07:37:24.0  )
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.. ఇల్లు కూలి ఒకరికి గాయాలు
X

దిశ, రాయపర్తి : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని అన్ని గ్రామాలలో ఊర చెరువులు, పెద్ద చెరువులు అన్ని మత్తడి దూకుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని కృష్ణాపురం, మురిపిరాల, కాట్రపల్లి, బురహాన్ పల్లి, కొండూరు, కొలను పెళ్లి, సన్నూరు గ్రామాల్లో చెరువులు భయంకరమైన పరిస్థితుల్లో అలుగు పోయడంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని వర్షానికి గోడలు నాని గుర్రపు సమ్మయ్య అనే వ్యక్తి రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఆ ఇంట్లో సమ్మయ్యతో పాటు ఇంటి పక్కనే ఉన్న యాకూబ్ అనే వ్యక్తి ఉండడంతో యాకూబ్ చేతికి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. యాకూబ్ ను హాస్పిటల్ తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ గ్రామంలోని చింతల చెరువు మత్తడి పోయడంతో అంబులెన్స్ అక్కడి నిలిచిపోయింది. దీంతో యాకూబ్ ను ఆటోల మత్తడి వరకు తీసుకువచ్చి స్ట్రక్చర్ పై గ్రామస్తులు మత్తడి దాటించి అంబులెన్స్ ఎక్కించారు. మండలంలోని మొరిపిరాల క్రాస్ రోడ్ వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పై చెట్లు విరిగిపడడంతో గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి జేసీబీతో చెట్లను తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed