పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య..

by Rajesh |   ( Updated:2024-05-22 04:03:10.0  )
పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య..
X

దిశ, అలంపూర్ : భూతగాదాలు, కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏ-బుడిదపాడు గ్రామానికి చెందిన మాల నరసింహులు తన భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (18) భూతగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో వరలక్ష్మి, అనురాధ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందేలోపే ఇద్దరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

మాల నరసింహులు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని భావించినా.. పురుగుల మందు తాగడానికి భయపడ్డాడు. అయితే తన కళ్ళ ముందే భార్య, కూతురు చనిపోవడంతో కుప్ప కూలిపోయాడు. గత కొన్ని రోజులుగా అన్నదమ్ములకు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం గొడవలు చేసుకున్నట్లు తెలిసింది. అయితే కూతురు, కొడుకు చదువు కోసం పెళ్లి కోసం చాలా ఇబ్బందులు గురవుతున్నామని, తమకు వారసత్వం కింద ఇచ్చిన భూములు సీలింగ్ ఉండడంతో ఎవరు కొనడం లేదని భావించి ఎన్నోసార్లు అన్నదమ్ములతో మాల నరసింహులు ప్రాధేయపడ్డాడు. తన కుటుంబానికి ఎవరూ సహకరించడం లేదని భావించి మంగళవారం కుటుంబ సభ్యులు చనిపోవాలని పురుగుల మందు సేవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో తల్లి కూతురు మృతి చెందారు. కొడుకు హైదరాబాద్‌లో చదువుకుంటున్నట్లు తెలిసింది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed