మణిపూర్‌లో మరో దారుణం.. ఇద్దరు విద్యార్థుల హత్య

by Vinod kumar |   ( Updated:2023-09-26 13:57:14.0  )
మణిపూర్‌లో మరో దారుణం.. ఇద్దరు విద్యార్థుల హత్య
X

గువాహటి: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇద్దరు మైనర్ విద్యార్థులను సాయుధులైన అనుమానాస్పద వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థులు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలతో ఘర్షణ జరిగింది. ఈ మేరకు గుంపును చెదరగొట్టడానికి బలగాలు.. టియర్ గ్యాస్ షెల్స్, పొగ బాంబులను ఉపయోగించాయి. దీంతో 30 మందికిపైగా విద్యార్థులు గాయపడగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో దాదాపు ఐదు నెలల నిషేధం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిరసన చెలరేగింది. కాగా రాష్ట్రంలో జాతి హింస ఉధృతంగా ఉన్న సమయంలోనే(జులై 6న) ఆ ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

Advertisement

Next Story