BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

by Satheesh |   ( Updated:2024-05-20 10:41:05.0  )
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కవార్దా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story