"డియర్ రజనీ.. నన్ను క్షమించు".. వచ్చే జన్మలో నా పిల్లలకు కొడుకుగా పుడతానంటు ఉద్యోగి ఆత్మహత్య

by Mahesh |   ( Updated:2024-08-18 08:05:45.0  )
డియర్ రజనీ.. నన్ను క్షమించు.. వచ్చే జన్మలో నా పిల్లలకు కొడుకుగా పుడతానంటు ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: డియర్ రజనీ.. నన్ను క్షమించు' అని లేఖ రాసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వసీం కి గత మూడు నెలలుగా జీతం అందలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో.. భార్య రజనీ కి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు రాసిన లేఖలో.. డియర్ రజనీ.. నన్ను క్షమించు' "డియర్ రజనీ. నేను నిన్ను చాలా బాధపెట్టాను. మాకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని ఎన్నో కలలు కన్నాను. కానీ ఏది కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకి కొడుకుగా పుడతా." అని రాశారు. తాను కొందరి దగ్గర చేసిన అప్పు తీర్చాలని భార్యను కోరాడు. కాగా ప్రస్తుతం ఈ సుసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అది చదివిన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. కాగా వసీం ది యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామం కాగా భార్య భర్తలు ఇద్దరు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇద్దరికి గత మూడు నెలలుగా జీతం రాకపోవడంతో వసీం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed