Accident: అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

by Shiva |   ( Updated:2024-08-16 14:42:22.0  )
Accident: అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి ఆర్టీసీ బోల్తా పడిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు రాథాకృష్ణపురం వద్దకు రాగానే అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదం నడిరాత్రి జరగడంతో సాయం చేసేందుకు ఎవరూ లేక అదే రూట్లో వెళ్తున్న ప్రైవేట్‌ వాహనాదారులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed