లిబియాలో భారీ వరదల కారణంగా 2000 మంది మృతి

by Mahesh |   ( Updated:2023-09-12 12:44:35.0  )
లిబియాలో భారీ వరదల కారణంగా 2000 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ తుఫాను కారణంగా ఆఫ్రికా ఖండంలోని లిబియాలో దేశంలోని డెర్నా నగరంలో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో ఈ వరదల్లో చిక్కుకుని దాదాపు 2000 మందికి పైగా మృతి చెందారు. అలాగే వేల సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు తూర్పు లిబియా అధికారులు తెలిపారు. లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియాతో మాట్లాడుతూ.. డెర్నా పైన ఉన్న ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు జరిగింది. దీంతో ఒక్కసారిగా భారీఎత్తున వచ్చిన వరదలు.. డెర్నా ప్రాంతంలో ఉన్న ఇళ్లను సముద్రంలోకి లాకెళ్లయి. దీంతో.. పెద్ద ఎత్తున మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story