ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య..

by Sumithra |
ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య..
X

దిశ, చింతలమానేపల్లి : మండలంలోని గూడెం గ్రామానికి చెందిన నింబర్ల బక్కుబాయి (50) ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బక్కుబాయి గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుండేదని, ఈ క్రమంలో ఈ నెల 16న తన తల్లిగారి ఊరైన దిందాకు వెళ్తానని ఇంట్లో చెప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా ఆమె ఆచూకి కోసం కుటుంబీకులు, బంధువులు గాలించగా చిత్తామ అటవీ ప్రాంతంలో గల ఓ చెట్టుకు ఉరేసుకొని మృతి చెంది ఉండడాన్ని గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై విజయ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తమ్ముడు డోకే మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed