అర్ధరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా.. నలుగురు మృతి

by Mahesh |
అర్ధరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో నలుగురు మృతి(Four died) చెందారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్(madyapradesh) రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలోని ఘటిగావ్‌లోని జఖోడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి(1 గంట తర్వాత) గ్రామస్తులను తీసుకొని వెళుతుండగా అదుపు తప్పిన ట్రాక్టర్(Tractor) ట్రాలీ.. రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్వాలియర్ ఎస్పీ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed