- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అఖండ-2’లో అలనాటి హీరోయిన్ కుమార్తె .. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్
దిశ, సినిమా: నట సింహం నందమూరి బాలకష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతోంది. అంతే కాకుండా రీసెంట్‌గా ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దీంతో.. ఈ మూవీ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘అఖండ-2’రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ప్రోమో విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ సినిమాలో బాలయ్యతో కలిసి నటించడానికి లయ కూతురు శ్లోకా చాన్స్ కొట్టేసిందని సమాచారం. లయ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైంలోనే పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది. ఇక చాలా కాలం తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినది. అదే మూవీలో తనతో పాటు తన కూతురు శ్లోకాను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే ఆ ఆ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేక డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే శ్లోకా డెబ్యూ గురించి చాలా మందికి తెలియకుండా పోయింది. కానీ తనకు ఇప్పుడు ‘అఖండ 2’లో బాలకృష్ణ కూతురిగా నటించే అవకాశం దక్కింది. మరి ఈ సినిమా అయినా శ్లోకాకు హిట్ తెచ్చిపెట్టి, లయ కూతురిగా ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా చేస్తుందేమో చూడాలి.