- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి
దిశ, కోనరావుపేట : ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్ శివారులోని ఓ పొలంలో ద్విచక్ర వాహనంతో పాటు యువకుడి మృతదేహం లభ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని నిజామాబాద్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వెనుక పొలంలో ఆదివారం యువకుడి మృతదేహంతో పాటు పల్సర్ బైక్ ఉన్నట్లు గ్రామానికి చెందిన దుర్గం చిరంజీవి అనే రైతు పోలీసులకు సమాచారం అందించారు. చిరంజీవి పొలం వద్ద పనులు చేస్తుండగా మృతదేహం కనిపించడంతో సమాచారం అందించాడు.
సమాచారం తెలుసుకున్న చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు మండల కేంద్రంలోని శివంగాపల్లి గ్రామానికి చెందిన బేజగం నర్సయ్య - దేవవ్వ దంపతుల కుమారుడు అనిల్ గా గుర్తించారు. కాగా మృతుడు అనిల్ శనివారం సాయంత్రం కనగర్తిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా నిజామాబాద్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర బైక్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి చనిపోయి ఉంటాడానికి తెలిపారు. కాగా మృతుడు అనిల్ కు భార్య పూజ, కొడుకు మధన్ (10), తల్లి దెవవ్వ ఉన్నారు. కాగా మండల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.