- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురితో సహా మహిళ అదృశ్యం..పదకొండు రోజులైనా..!
దిశ,కామారెడ్డి : నాలుగేళ్ల కుమార్తెతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని భవాని రోడ్ లో సమీపంలో చాట్ల స్వరూప (35) నివాసం ఉంటుంది. అయితే ఆమెకు గత ఆరు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఆమెకు సంయుక్త అనే ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో వేరువేరుగా ఉండటంతో..ఆమె కామారెడ్డిలోని తల్లి తండ్రులతో కలిసి ఉంటుందన్నారు. అయితే ఈ నెల 4న ఉదయం తన నాలుగు సంవత్సరాల కూతురుతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడో వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమె ఆచూకీ గురించి చుట్టుపక్కల,తెలిసిన వారి వద్ద వెతికినా దొరకలేన్నారు. దీంతో తల్లి అయిన సిద్దవ్వ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. చాట్ల స్వరూపకు కుడికాలు వంకరగా ఉంటుందన్నారు.తన ఆచూకీ తెలిసినవారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.