- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: ఆయుధాలు వదిలి రండి.. పునరావాసం ప్రభుత్వ బాధ్యత: అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో చేరాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో జరిగిన బస్తర్ ఒలంపిక్స్‌లో పాల్గొన అమిత్ షా, 2026, మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు విముక్తి దేశంగా మారుతుందన్నారు. లొంగిపోయే నక్సల్స్‌ను స్వాగతిస్తున్నాం. ఆయుధాలు వదిలేసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ దీన్ని నిరాకరిస్తే భద్రతా బలగాల నుంచి కట్టుదిట్టమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ప్రభుత్వ పునరావాస విధానం దేశంలోనే అత్యుత్తమమైనది. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ఛత్తీస్‌గఢ్‌తో పాటు భారత అభివృద్ధికి సహకరించిన వారవుతారు. బస్తర్‌లో నక్సలిజం లేకపోతే కశ్మీర్ కంటే ఎక్కువమంది పర్యాటకులు ఇక్కడికి వస్తారని, బస్తర్‌కు ఉన్న సహజ ప్రకృతి అందం ఎంతో ఆకర్షించగలదని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తీవ్రవాదులపై చర్యలు వేగవంతం చేశామని, గతేడాది కాలంలో 287 మంది నక్సల్స్ హత్యలు, 992 మంది నక్సల్స్ అరెస్టు, 836 మంది లొంగిపోయారని ఆయన చెప్పారు.