BRS Leader: వారంలో ఒకరోజు సీఎం రేవంత్‌ కూడా అక్కడికి వెళ్లాలి

by Gantepaka Srikanth |
BRS Leader: వారంలో ఒకరోజు సీఎం రేవంత్‌ కూడా అక్కడికి వెళ్లాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాల(government schools)ల్లో 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు సమస్యలు చెబుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గురుకుల హాస్టళ్లలో మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా వారంలో ఒకరోజు నిద్ర చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో సమస్యలపై తాము మాట్లాడే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలేవలేదని విమర్శించారు. 53 మంది విద్యార్థుల మృతికి కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt)మే కారణమని ఆరోపించారు.

ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. తెలంగాణ తల్లిని మార్చడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్‌లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము కొలుస్తామని అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో తెలంగాణ తల్లి తమకు స్ఫూర్తిని ఇచ్చిందని.. ధైర్యాన్ని నింపిందని తెలిపారు. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని తెలిపారు. తెలంగాణ అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story