‘హిట్-3’ థర్డ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్‌ షేర్ చేస్తూ మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2025-04-25 12:24:42.0  )
‘హిట్-3’ థర్డ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్‌ షేర్ చేస్తూ మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (NANI), శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబినేషన్‌లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-3’(Hit-3). అయితే ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.. ఈ మూవీలో నాని సరసన పాన్ ఇండియా బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ‘హిట్-3’ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ ఓ వైపు ఇంటర్వ్యూలో పాల్గొంటూనే వరుస అప్డేట్స్ విడుదల చేస్తు్న్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మూడో పాట రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. నాని, శ్రీనిధి శెట్టి కాంబోలో రాబోతున్న ఈ రొమాంటిక్ పాట ‘తను’ ఏప్రిల్ 25న సాయంత్రం 4: 05 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో హీరోయిన్ గోడకు నిల్చొని ఉండగా.. నాని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెడుతున్నట్లు కనిపించాడు. అయితే ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ పాడినట్లు కూడా తెలుపుతూ ఫైర్, క్రాకర్స్ ఎమోజీలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నాని అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.



Next Story

Most Viewed