బైక్​ పై నుంచి పడి వ్యక్తి మృతి

by Kalyani |
బైక్​ పై నుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ,పరిగి : పొరుగు రాష్ట్రానికి కూలీ పని చేసుకొనేందుకు వచ్చి స్వగ్రామానికి వెళ్తూ హైవే 163 పై వెళ్తున్న బైక్​ అదుపు తప్పి కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పరిగి ఎస్​ఐ సంతోష్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లా సేడం తాలూకా గోపన్​ పల్లి గ్రామానికి చెందిన రాజు(28) కొంతకాలంగా హైదరాబాద్​ గోల్కొండ సమీపంలో కూలీ పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి బైక్​ పై వెళ్తూ ఆదివారం పరిగి మండలం చింతల్​ చెరువు వద్ద హైవే 163 రోడ్డు మలుపు వద్ద బైక్​ అదుపుతప్పి రోడ్డు కిందకు వేగంగా దూసుకుపోయింది. దీంతో కిందపడిన రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన వాహన చోదకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు రాజును గమనించి లేపే ప్రయత్నం చేయగా తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజు కుటుంబీకులకు సమాచారం అందించారు. రాజు భార్య సావిత్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ సంతోష్​ కుమార్​ తెలిపారు.

Advertisement

Next Story