BRS: గత తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత శంకుస్థాపన.. జీవో ప్రకారం కవితపై చర్యలుంటాయా?

by Ramesh Goud |   ( Updated:2024-12-15 12:43:30.0  )
BRS: గత తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత శంకుస్థాపన.. జీవో ప్రకారం కవితపై చర్యలుంటాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతిని(Telangana Culture) తుడిపెట్టలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) అన్నారు. జగిత్యాల(Jagithyala) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం(నెత్తిమీద కిరీటం, చేతిలో బతుకమ్మ)(Telangana Thalli Statue) నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి మన గర్వం, బతుకమ్మ దీనికి గుండె చప్పుడు అని, ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలే రక్షణగా నిలుస్తారన్నారు. అంతేగాక జగిత్యాలలో 22 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహానికి సగర్వంగా పునాది వేశామని, ఎందుకంటే మన వారసత్వాన్ని ఎవరు తుడిచి, పక్కన పెట్టలేరని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. డిసెంబర్ 9న ప్రభుత్వం సచివాలయంలో 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి నమూనాపై ఒక జీవో విడుదల చేశారు. ఈ జీవోలో తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడం లాంటివి నిషేధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ జీవోకు విరుద్ధంగా కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయడం రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిలిపితే.. జీవో ప్రకారం వేరే విధంగా చూపించడం అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందా.. లేదా? అనేది ప్రశ్నార్ధకం అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed