Venu Swamy: అల్లు అర్జున్ పార్టీ పెట్టి కీలక పదవి పొందుతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-12-15 16:48:31.0  )
Venu Swamy: అల్లు అర్జున్ పార్టీ పెట్టి కీలక పదవి పొందుతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) నిత్యం పలువురు సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తుంటారు. అయితే నాగచైతన్య(Naga Chaitanya), శోభిత పెళ్లికి ముందు వారి జాతకం చెప్పడంతో వివాదాస్పదమయ్యాయి. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. ఆయన సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పనని అన్నారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో వేణు స్వామి గతంలో చెప్పిన జాతకానికి సంబంధించిన వీడియోలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

తాజాగా, వేణు స్వామికి సంబంధించిన ఓ వీడియో(Video) నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఆయన జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) కూడా త్వరలోనే సీఎం అయ్యే చాన్స్ ఉంది. 100 శాతం ఆయన కచ్చితంగా పార్టీ పెడతాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక వేణు స్వామి వీడియో నెట్టింట వైరల్ కావడంతో వేణు స్వామిపై ట్రోలింగ్ మొదలెట్టారు. జైలుకి వెళ్లిన ప్రతి ఒక్కరూ సీఎం అవుతున్నారు? అంటే ఇటీవల చాలా మంది వెళ్లారు. సీఎంలు కాలేదు కదా అని దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed