- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: అల్లు అర్జున్ పై కక్ష గట్టి జైలుకు.. ఎమ్మెల్యే వివేకానంద్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ (BRS MLA KP Vivekanand Goud) ఆరోపించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతీ అంశంలో మాట మారుస్తుందని, తెర మీదికి తెచ్చిన ప్రతీ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే మాట మార్చి, తోక ముడుచుకుంటుందని అన్నారు. అలాగే కాళేశ్వరం(Kaleswaram) కుప్పకూలిపోయిందని, నిధులు మొత్తం వ్యర్థం అయిపోయాయని మాట్లాడారని, కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మల నుంచి నీళ్లు తరలిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అంతేగాక తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన అల్లు అర్జున్(Allu Arjun) రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని కక్ష గట్టి ఆయన జైలుకు పోయేలా చేసి పైశాచిక ఆనందం పొందారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఘట్‌కేసర్ పీఏసీ(Gatkesar PAC) పరిధిలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అవ్వలేదని, మీకు దమ్ముంటే ఘట్‌కేసర్ రైతులకు రుణమాఫీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు(PCC President Mahesh Kumar Goud) సవాల్(Challenge) విసిరారు. అంతేగాక రైతులపై చిత్తశుద్ది ఉంటే సంపూర్ణ రుణమాఫీ చేసి చూపించాలని అప్పుడే మీరు నిజమైన పీసీసీ అధ్యక్షుడు అవుతారని, లేదంటే డమ్మీ పీసీసీ గా మిగిలిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.