Bibinagar: ఎయిమ్స్ పాలక మండలిలో తెలంగాణ ఎంపీలు

by Ramesh Goud |
Bibinagar: ఎయిమ్స్ పాలక మండలిలో తెలంగాణ ఎంపీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎయిమ్స్ పాలక మండలిలో తెలంగాణ ఎంపీలకు స్థానం లభించింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ సైన్స్ బీబీనగర్ గవర్నమెంట్ బాడీలో ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్​ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. దేశ వ్యాప్తంగా 12 ఎయిమ్స్ పాలక మండలి సభ్యులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన 24 ఎంపీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ మేరకు లోక్ సభ ప్రత్యేక బులెటెన్ ను రిలీజ్ చేసింది. భువనేశ్వర్, బిలాస్ పూర్, డీయోగ, హౌహాటి, జమ్ము, జోథ్ పూర్, మధురై, మంగలగిరి, పాట్నా, రాయ్ పూర్, రిషికేషీ లో ఉన్న ఎయిమ్స్ లకు కేటాయించారు. ఈ ఏడాది నవంబరు 29 న, డిసెంబరు 6న వేసిన నామినేషన్ల నుంచి సభ్యులను సెలక్ట్ చేసినట్లు లోక్ సభ తన బులెటెన్ లో పేర్కొన్నది.

ప్రతి ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్ కు సగటును ఆరు చొప్పున నామినేషన్లు రాగా, అందులో వివిధ ప్రమాణికాలను పరిగణలోకి తీసుకొని సభ్యులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇక నేషనల్ అసిస్టెడ్ రీ ప్రోడక్టీవ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డ్ లో వరంగల్ ఎంపీ కడియం కావ్యకు చోటు లభించింది. దీంతో పాటు కొకోనట్ డెవలప్ మెంట్ బోర్డు, అధికారిక భాషా కమిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూటా ఆఫ్​ టెక్నాలజీ కౌన్సిల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​టెక్నాలజీ, సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ , ఆలీగర్బ్ ముస్లీం యూనివర్సిటీ, టోబాకో బోర్డ్, అగ్రికల్చర్ అండ్ ప్రోసీడ్ ఫుడ్ ప్రాడక్ట్ ఎక్స్ పర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్, చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రివేండ్రంకు సభ్యులను ఎంపిక చేసినట్లు లోక సభ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed