- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Inc: రికార్డు స్థాయిలో నిధులు సేకరించిన దేశీయ కంపెనీలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది దేశీయంగా కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్యూఐపీ) ద్వారా రికార్డు స్థాయిలో సేకరించాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, స్టాక్ మార్కెట్ ర్యాలీ అత్యంత సానుకూలంగా ఉండటం, అధిక వాల్యూయేషన్ కారణంగా 2024 కేలండర్ ఏడాదిలో కంపెనీలు రూ. 1,21,321 కోట్ల వరకు సమీకరించాయి. గత కేలండర్ సంవత్సరంలో సమీకరించిన రూ.52,350 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్ల పరిస్థితులు స్థిరంగా ర్యాలీ చేస్తుండటంతో క్యూఐపీ ద్వారా కంపెనీలు మూలధన నిధులను సేకరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరంలో నవంబర్ వరకు 82 కంపెనీలు క్యూఐపీ ఇష్యూలతో క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించాయి. గతేడాది ఇదే కాలంలో కేవలం 35 కంపెనీలు మాత్రమే రూ. 38,220 కోట్లు సమీకరించాయి. క్యూఐపీ ద్వారా నిధుల సేకరణ అనేది మ్యూచువల్ ఫండ్, బీమా వంటి క్వాలిఫైడ్ కంపెనీల నుంచి పెట్టుబడి సేకరణ. ఈ పద్దతి మార్కెట్ నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి ముందస్తు ఫైలింగ్ సమర్పించకుండా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి తక్కువ సమయంలో నిధుల సమీకరణకు వీలు కల్పిస్తుంది. ఈ ఏడాది క్యూఐపీల నుంచి అత్యధికంగా రూ. 8,500 కోట్ల వరకు నిధులను సమీకరించిన కంపెనీల్లో వేదాంత గ్రూప్, జొమాటో ఉన్నాయి. వాటి తర్వాత అదానీ ఎనర్జీ సొల్యూషన్స్(రూ.8,373 కోట్లు), వరుణ్ బెవరేజెస్(రూ.7,500 కోట్లు) సమీకరించాయి.