నియోజవర్గంలోని ప్రజలు ఉచిత అంబులెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే

by Kalyani |
నియోజవర్గంలోని ప్రజలు ఉచిత అంబులెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే
X

దిశ ,బేగంపేట : ఉచిత అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద సనత్ నగర్ కు చెందిన కిద్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సనత్ నగర్ డివిజన్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కిద్మత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. సనత్ నగర్ డివిజన్ ప్రజలు అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ సేవల కోసం 8096188429 నెంబర్ ను సంప్రదించాలని చెప్పారు. ఉచిత అంబులెన్స్ సేవలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కిద్మత్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అద్యక్షులు నిస్సార్ అహ్మద్, సయ్యద్ అఖిల్, మైనార్టీ నాయకులు జమీర్, నోమాన్, వసీం, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story