దిశ కథనానికి స్పందన..ముగ్గురు అరెస్ట్

by Naveena |
దిశ కథనానికి స్పందన..ముగ్గురు అరెస్ట్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతం నుంచి నకిలీ బోనఫైడ్లు సృష్టించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో రికార్డులను సైతం ట్యాపరింగ్ చేసిన విషయం దిశ కథనంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందుకు రంగంలోకి దిగిన అచ్చంపేట పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం తమదైన శైలిలో విచారణ వేగవంతం చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి..రిమాండ్ కు తరలించినట్లు అచ్చంపేట ఎస్సై రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న మేకల లింగస్వామి ఫిర్యాదు మేరకు..నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అదే హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న అటెండర్ కే ఎల్లయ్య సహాయంతో నల్లగొండ జిల్లా, పూలే నాయక్ తండా గ్రామానికి చెందిన డి రవీందర్, పదర మండలం చిట్లిగుంట గ్రామానికి చెందిన అనిల్ వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనే వ్యక్తులు ముగ్గురు కలిసి ఆశ్రమ పాఠశాలలోని రికార్డులను ట్యాంపరింగ్ చేశారని హెచ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story