Zakir Hussain: ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్

by S Gopi |
Zakir Hussain: ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు సన్నిహితులు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ప్రఖ్యాత ఫ్లూటిస్ట్, జాకీర్ హుస్సేన్ సన్నిహితుడు రాకేష్ చౌరాసియా ఆదివారం తన స్నేహితుడి పరిస్థితి గురించి జాతీయ మీడియాకు తెలియజేశారు. జాకీర్ హుస్సేన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, తన పరిస్థితి గురించి తామంతా ఆందోళనగా ఉన్నామని తెలిపారు. జాకీర్ హుస్సేన్‌కు బీపీ సమస్య ఉంది. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో శాన్ ఫ్రాన్సిస్కోలోనే చికిత్స తీసుకుంటున్నారు. 73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ ప్రపంచంలోనే గొప్ప తబలా విధ్వాంసుడిగా గుర్తింపు పొందారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఆయన కృషి ఎంతో గొప్పందం. ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు దరిచేరాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి సత్కారాలు దక్కాయి.

Advertisement

Next Story

Most Viewed