- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెంట్ హౌస్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం
దిశ, మేడ్చల్ టౌన్ : షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ టెంట్ హౌస్ గోడౌన్లో మంటలు చెలరేగి సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన ఆదివారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం ఉప్పర్ పల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న ఆర్కే టెంట్ హౌస్ గోడౌన్ లో ఉదయం 11 గంటల ప్రాంతంలో లేబర్ నివసించే గదిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ గోడౌన్లో టెంట్లు , కార్పెట్లు ఇతర వస్తువులు ఉండడంతో మంటలు ఎక్కువయ్యాయి. ఆ మంటలను గమనించిన సూపర్వైజర్ విశాల్ శామీర్ పేట పోలీసులకు, అగ్నిమపాక సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమపాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో లేబర్స్ అక్కడ లేకపోవడంతో ఎవ్వరికీ ప్రాణహాని జరగలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికుల సమాచారం. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.