జప్తి నాచారంలో హైనా కలకలం

by Kalyani |
జప్తి నాచారంలో హైనా కలకలం
X

దిశ కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో లేగ దూడ పై హైనా దాడి చేసి చంపేసిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మాస్తి పరశురాములు తన వ్యవసాయ పొలం వద్ద కొట్టంలో పశువులను కట్టేశాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి లేగ దూడ చనిపోయి ఉంది. హైనా లేదా పులి దాడి చేసి చంపేసి ఉండవచ్చని భావిస్తున్నారు. లేగ దూడ చనిపోయిన ప్రాంతంలో రక్తపు చుక్క ఆనవాళ్లు ఏమాత్రం లేవని దీంతో హైనా లాంటిది దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామాల పరిసర ప్రాంతంలో గత కొన్ని రోజుల నుంచి పులి లాంటిది సంచరిస్తుందని అనుమానాలు ఉన్నాయి. లేగ దూడపై దాడి జరగడంతో రైతులు భయాందోళన గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed