- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-2 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లాలో గ్రూప్ -2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం పరీక్షకు 3994 అభ్యర్థులకు 2052 హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు మొత్తం 3994 అభ్యర్థులకు 2046 మంది హాజరు కాగ..ఉత్తీర్ణత శాతం 51గా ఉంది. పట్టణంలోని బ్రిలియంట్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న grup-2 పరీక్షా సరళిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఆయా కేంద్రాలలో పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు?.. ఎంత మంది గైర్హాజరు అయ్యారని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ గదులను, వైద్య, ఇతర సౌకర్యాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. అయితే శిశు మందిర్ పాఠశాల కేంద్రంలో ఓ అంధత్వ అభ్యర్థి సహాయకురాలి సహాయంతో పరీక్ష రాస్తుండటాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కాగ ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయగా..పలు కేంద్రాల వద్ద పరిస్థితిని ఎస్పీ పరిశీలించారు.