అక్కడ స్నానం చేస్తే మంచిది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అక్కడ స్నానం చేస్తే మంచిది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) కుంభమేళా-2025పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతోందని అన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) జరుగనుందని తెలిపారు. 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ కుంభమేళాలో పెద్ద ఎత్తున హిందువులు పుణ్యస్నానాలు చేస్తారని తెలిపారు. తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తారని అన్నారు. ఈ క్రమంలోనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. యూపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాము కూడా కుంభమేళాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రయాగ్ ఘాట్‌లో స్నానం చేస్తే మంచిదని భక్తులు నమ్ముంటారని చెప్పారు. ఆరు పుణ్య దినాల్లో గంగానదిలో చేయాలని చెబుతారని వెల్లడించారు. జనవరి 13, 14, 29 తేదీల్లో ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగా నదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితం అని అన్నారు.

Advertisement

Next Story