- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతును రాజుగా చూద్దాం : మంత్రి తుమ్మల
దిశ,పరిగి : ఆనాడు కాంగ్రెస్ హయాంలో రైతుల ముఖంలో కనిపించిన ఆనందం నేడు మళ్లీ మన సీఎం రేవంత్ రెడ్డి హయాంలో సంతోషం కనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్ హుస్సే లు ,పాలక మండలి సభ్యులచేత మంత్రుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రైతుల కన్నీటిని తుడిచేందుకే సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రైతులు తీసుకున్న రుణాలను ఒకే దఫాలో రూ. 21 వేల కోట్ల రుణ మాఫీని చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులను రాజుగా చేయాలన్న సంకల్పతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా పొలం బాట పట్టారన్నారు.
ఇక మీదట రైతుల పనిముట్లకు సబ్సిడీ వర్తింప చేస్తామని, మహిళా రైతుల పేరున రుణాలు ఇవ్వడం జరుగుతుందని, బతుకమ్మ పండుగ సందర్భంగా నాణ్యమైన రెండు జతల చీరలను అందజేస్తామని ఆయన అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే విధంగా రైతులు పంటలు సాగు చేయాలని మంత్రి తెలిపారు. రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధరను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన అన్నారు. రైతులు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్ కు అదనంగా రూ. 500 బోనస్ ను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు వ్యవసాయంలో మార్పులు గమనిస్తూ పంటలు సాగు చేయాలని, రైతులకు కాపాడుకునే బాధ్యత మాదని మంత్రి అన్నారు. రైతులు ఫామ్ ఆయిల్, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత కల్పిస్తూ సాగులో అధిక లాభాలను ఆర్జించాలని మంత్రి సూచించారు.
రైతుల పంటలు చెడిపోకుండా కాపాడుకునేందుకు వీలుగా మార్కెట్ యార్డుల్లో శీతల గిడ్డంగులను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా పండించిన పంటలను హోల్ సేల్ మార్కెట్లో విక్రయించేందుకు కోహిడ వద్ద మార్కెట్ కు సన్నద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాకు త్రిబుల్ ఆర్ రోడ్డు రావడం వల్ల భూములకు భారీగా డిమాండ్ పెరుగుతుందని, బంగారం కొనవచ్చు కానీ భూమిని కొనలేమని రైతులు ఎవరు కూడా భూములను అమ్ముకోకూడదని ఈ సందర్భంగా మంత్రి రైతులకు సూచించారు. వికారాబాద్ ప్రాంతం పండ్లు, పూలు, ఉద్యానవన పంటలకు అనువుగా ఉంటుందని ఇలాంటి పంటలు వేసి ఆర్థికంగా ఎదగాలని రైతులకు సూచించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అంటే ఓ ప్రత్యేకత ఉందని అభివృద్ది గురించి అసెంబ్లీలో గడగడ లాడించి అందరినీ నిలదీసి ఒప్పించి మరీ నిధులు తీసుకువస్తాడని అభినందించాడు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ… వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసుకోవాలని, వ్యవసాయంలో అభివృద్ధి చెందుతేనే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలుగా పంటలను సాగు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , ఆడపిల్లలకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. రైతులు కందులు, పెసలు , ఉల్లిగడ్డలు తదితర పంటల మార్పిడిల వల్ల కుటుంబాల అవసరాలకు వాడుకుంటూనే పంటలను విక్రయించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశముందని ఆమె తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని,రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే మేమంతా పనిచేస్తున్నామన్నారు.
శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన నెరవేర్చడం జరుగుతుందన్నారు. జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అభివృద్ధి దిశగా పయనిస్తూనే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన అన్నారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ అందిస్తున్న ఫలితాలను పొందుతూ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని కోరారు.
పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేసిన రైతు భరోసా అమలు చేస్తామన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వల్ల రైతులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు. పరిగి నియోజకవర్గంలో రుణ మాఫీ పెద్ద మొత్తంలో రైతులు లబ్ధి పొందారని తెలిపారు. సన్న బియ్యం పండించిన రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల ఒక్కో రైతుకు 20 వేల వరకు లాభం జరిగిందని తెలిపారు.చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు, రైల్వే లైన్ పరిగి తీసుకువచ్చే క్రమంలో రాకుండా అడ్డుకొని గత ప్రభుత్వం మోసం చేసిందని ఆయన తెలిపారు.
అనంతరం పరిగి మండల కేంద్రంలో మున్సిపల్ భవనానికి, పరిగి నుండి మల్లెమోని గూడ రోడ్డు, 20 గ్రామాలకు అనుసంధాన రోడ్డుగా ఉండే లక్నాపూర్ రోడ్డు, బంజారా భవన్ పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రజాప్రతినిధులు, అధికారులచే శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ రెడ్డి లు పాల్గొన్నారు.