- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్‌తో సూర్య మూవీ ఫిక్స్?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) ఇటీవల ‘కంగువ’(Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సూర్య 44, 45 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్స్‌కు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, సూర్య మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri)తో సూర్య ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన ఆయన ఇప్పుడు సూర్యతో తెలుగు చిత్రం చేస్తున్నట్లు తెలియడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.