- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha : పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపచేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
దిశ, వెడ్ డెస్క్ : పెంచిన డైట్ ఛార్జీల(Increased diet charges)ను కస్తూర్బా పాఠశాలల(Kasturba schools)కు వర్తింపజేయకపోవడం అన్యాయమని, ఈ పాఠశాలల్లో కూడా పెంచిన డైట్ ఛార్జీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా పాఠశాలను కవిత సందర్శించారు. పాఠశాల విద్యార్థినిల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలున్నాయని, విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలని కోరారు.
సర్వ శిక్ష అభియాన్ కింద పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, హామీ మేరకు వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదని, విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడకూడదని కోరారు.