Happy birthday baby: లావణ్యకు క్యూట్ విష్ చేస్తూ.. బ్యూటిఫుల్ పిక్స్ పంచుకున్న వరుణ్

by Anjali |
Happy birthday baby: లావణ్యకు క్యూట్ విష్ చేస్తూ.. బ్యూటిఫుల్ పిక్స్ పంచుకున్న వరుణ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పుట్టిన రోజు. ఈ సందర్భంగా లొట్టచెంపల ముద్దగుమ్మకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికన బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ(Mega Family) వారు లావణ్యకు స్పెషల్ విష్ చేస్తూ తనపై ప్రేమకు వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి భర్త మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Mega Prince Varun Tej) ఇన్‌స్టాగ్రామ్ వేదికన పోస్ట్ పెట్టి.. ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ. నువ్వు నా జీవితంలో ఆనందం, శాంతి తెచ్చిపెట్టావు. ప్రతి రోజు, ప్రతి గంట.. ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుంది. లవ్ యూ అంటూ నన్ను డ్యాన్స్ చేయించగలిగేది నువ్వే ఒక్కదానివే’ అంటూ వరుణ్ పలు బ్యూటీఫుల్ ఫొటోలు అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వరుణ్ పోస్ట్ సోషల్ మీడియాలోని జనాల్ని ఆకట్టుకుంటోంది. ఇక వీరిద్దరు సినిమాలో నటించే క్రమంలో ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed