Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

by Y. Venkata Narasimha Reddy |
Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta)శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple)లో ఆదివారం సెలవు దినం, పూర్ణిమ సందర్భంగా భక్తులు(Devotees Crowd)పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. గర్భాలయంలో స్వామివారికి నిత్య పూజలను శాస్త్రయుక్తంగా కొనసాగించారు. లక్ష్మినరసింహుల నిత్య కల్యాణోత్సంలో భక్తులు పెద్ధ సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. హైకోర్టు జస్టిస్ ఎస్.వి.శ్రవణ్ కుమార్ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అటు బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ పూర్ణిమ పురస్కరించుకుని చిన్నారుల అక్షరాభ్యాసం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

Next Story