అభివృద్ధి చూసే కాంగ్రెస్ లో చేరిక

by Sridhar Babu |
అభివృద్ధి చూసే కాంగ్రెస్ లో చేరిక
X

దిశ, తిరుమలగిరి : అభివృద్ధికి ఆకర్షితులై 4వ వార్డు ఎల్ఐసీ కాలనీ అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆయనతో పాటు పలువురికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దాంతో ప్రతి ఒక్కరి చూపు కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story