దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే

by Kalyani |
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే
X

దిశ, చైతన్యపురి : కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కారం చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని గాంధీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్ ప్రారంభించారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ… కమ్యూనిటి హాల్ చుట్టూ నూతనంగా ప్రహరీగోడ, సీసీ బెడ్ నిర్మించాలని కోరారు. స్ట్రామ్ వాటర్ నీరు పోవడానికి ట్రంక్ లైన్ నిర్మించాలని, త్రీఫేస్ కరెంటు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో చిన్నపాటి వర్షానికి కాలనీలు మొత్తం వరద నీటితో మునిగేవని ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవన్నారు. నూతన బాక్స్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టి ముంపు సమస్యల నుంచి విముక్తి చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, సుమన్ గౌడ్, అనిల్ చౌదరి, మాధవరం నర్సింగ్ రావు, గంగం శివశంకర్, ముద్దగోని సతీష్ గౌడ్, జగన్మోహన్ రావు కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాదక్షులు నర్సింహారెడ్డి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రాంబాబు, ప్రభాకర్ రావు, ఆరిఫ్, శశిధర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story