చిన్నరాజమూర్ శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

by Naveena |
చిన్నరాజమూర్ శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
X

దిశ, దేవరకద్ర: దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ప్రభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ,ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు. అనంతరం దేవాలయ అధికారులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed