- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: దమ్ముంటే చర్చకు రా.. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) సవాల్(Challenge) విసిరారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి.. నిన్న చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు(Gurukulas) ఏం చేయలేదని, డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదని చెప్పారని అన్నారు. అంతేగాక గురుకులాల ప్రతిష్టను పూర్తిగా మంట గలిపారని, అందుకే గురుకులాలను రిపేర్ చేసే బాధ్యత తీసుకున్నానని చెప్పినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నానని, డైట్ చార్జీల మీద నా దగ్గర డేటాను తీసుకొని వస్తాను.. ఆయన దగ్గరున్న డేటాను తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్(BRS Govt) హయాంలో కేసీఆర్(KCR) ఒక్క గురుకులాలకే కాదు.. అన్ని సాంఘీక సంక్షేమ విద్యాలయాలకు డైట్ చార్జీలు పెంచారని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మరణిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress Government) చలనం లేదని మండిపడ్డారు. పిల్లలు చనిపోతుంటే కదలని ప్రభుత్వం.. నిన్న మాత్రం పెద్ద హడావిడి చేసిందని, కాంగ్రెస్ మంత్రులు పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నట్లు పిక్‌నిక్ లాగా డ్రామా చేసారు. కాంగ్రెస్ నాయకులు చేసిన గురుకుల బాట కార్యక్రమం పిక్‌నిక్ లాగా జరిగిందని ఆర్ఎస్పీ ఆరోపించారు.