- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
దిశ, ఇంద్రవెల్లి : పూలాజీ బాబా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండలంలోని అంజి గ్రామంలో శ్రీ పూలాజీ బాబా 35వ ఆధ్యాత్మిక సత్సంగ్ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు.
ఆలయానికి మరెన్నో నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బొజ్జరెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముకడే ఉత్తం, పట్టణ అధ్యక్షులు జహీర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ. మసూద్, మెస్రం నాగ్ నాథ్, సోమరే నాగోరావ్, కొమరయ్య, జితేందర్, గ్రామస్తులు రాంకిసన్, మహదు శంకర్, తుకారాం, ముకడే విష్ణు పాల్గొన్నారు.