Pushpa 2 : అక్కడ " పుష్ప 2 " మెగా బ్లాక్ బస్టర్ .. పది రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

by Prasanna |
Pushpa 2 : అక్కడ  పుష్ప 2  మెగా బ్లాక్ బస్టర్ .. పది రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) కథానాయికగా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఫస్ట్ డే నే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్ లో చరిత్ర సృష్టించింది. నార్త్ లో కూడా దూసుకెళ్తుంది.

ఈ క్రమంలోనే హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ పుష్పా రాజ్ దూసుకెళ్తున్నాడు. డిసెంబర్ 05 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మొద‌టి రోజు హిందీలో రూ.72 కోట్ల క‌లెక్ష‌న్లు మాత్రమే వసూలు చేయగా..రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లు, నాలుగో రోజు రూ. 86 కోట్లు, ఐదో రోజు రూ. 48 కోట్లు, ఆరో రోజు రూ.36 కోట్లు వసూలు చేసింది. ఇలా ఒక్క హిందీలోనే కేవలం ఆరు రోజుల్లో రూ.375 కోట్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది. ఇంత వరకు హిందీలో ఏ మూవీ కూడా ఈ రేంజ్ వసూళ్లను కలెక్ట్ చేయలేదు. అంతేకాకుండా, పది రోజుల్లో రూ. 500 కోట్ల నెట్ ను వసూలు చేసిన మూవీగా అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు.

Advertisement

Next Story

Most Viewed