AUS vs IND 3rd Test: మూడో టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు

by Mahesh |
AUS vs IND 3rd Test: మూడో టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట మ్యాచ్ (Third test) శనివారం బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం అయింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్(India) బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా(Australia) జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా వర్షం కారణంగా మొదటి రోజు 13.1 ఓవర్లు మాత్రమే ఆడగా.. రెండో రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచికొట్టారు మొదటి సెషన్ ఆరంభంలో కీలక వికెట్లు పడినప్పటికీ.. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లు భారత బౌలర్లను ఓ ఆట అడుకున్నారు. నెమ్మదిగా ఆడుతూనే లూస్ బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో మరోసారి సెంచరీతో చెలరేగిపోయిన హెడ్.. ఏకంగా 152 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే మరోపక్క స్టివ్ స్మిత్.. హెడ్ కు సపోర్టుగా నిలుస్తూ.. 190 బంతుల్లో 12 ఫోర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కొద్ది సేపటికే 101 పరుగుల వద్ద బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా 152 పరుగుల వద్ద బూమ్ర చేతిలో అవుట్ కావడం విశేషం. ఇదిలా ఉంటే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఉస్మాన్ ఖవాజా 21, స్మిత్ 101, హెడ్ 152, పాట్ కమ్మిన్స్ 20, అలెక్స్ కేరీ 45* పరుగుల చేశారు. ప్రస్తుతం క్రీజులో కేరి 45, మిచెల్ స్టార్క్ ఉన్నారు. కాగా భారత ఔలర్లలో బూమ్మ 5 వికెట్లు తీసుకొగా నితిష్ కుమార్ రెడ్డి, సిరజ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed