బిగ్‌బాస్-8 ఫైనల్ ఎఫెక్ట్.. హైదరాబాల్ పోలీసుల సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |
బిగ్‌బాస్-8 ఫైనల్ ఎఫెక్ట్.. హైదరాబాల్ పోలీసుల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-8 ఫైనల్(Bigg Boss-8 Final) నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు(Hyderabad Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియో వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతేడాది పల్లవి ప్రశాంత్ ఘటనలో పోలీసులు ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. అభిమానుల అత్యుత్సాహంతో గతేడాది పరిస్థితి అదుపుతప్పిన విషయం తెలిసిందే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావొద్దని సూచనలు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరానగర్‌, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు వాహన రాకపోకలపై నిషేదం విధించారు. బందోబస్తు ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్(DCP Vijay Kumar) పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు బిగ్‌బాస్ నిర్వహకులదే బాధ్యత అని హెచ్చరించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed