- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: జగదీశ్ రెడ్డిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు.. మైండ్ బ్లాంక్‌లో బీఆర్ఎస్

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ పార్టీ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తాము చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పేందుకు రెడీగా ఉన్నామంటూ సంకేతాలు పంపినా స్పీకర్ వినలేదు. కనీసం వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ మేరకు ఈ సెషన్ కాలం పాటు సభలోకి రాకుండా సస్పెన్షన్ విధించారు. దీనితో ఏం చేయాలో, ఎలా నిరసన తెలపాలో అర్థం కాక గులాబీ ఎమ్మెల్యేలు కాసేపు మౌనంగా ఉండిపోయారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారే తప్పా పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి వెంటనే ఆగిపోయారు. ఎదురుగా ఉన్న మార్షల్స్‌ను నెట్టుకుని ముందుకు వెళ్తే ఎక్కడ తమపై వేటు వేస్తారనే భయంతో కావచ్చు. వారు అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నించలేదని తెలుస్తున్నది.
కలిసిరాని మజ్లిస్
స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు తమకు మాట్లాడే అవకాశం ఇప్పించాలని మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌కు హరీశ్‌రావు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది. ఈలోపే సభాపతి జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడైనా తమకు సంఘీభావంగా రావాలని హరీశ్ చేసిన సూచనను కూడా అక్బర్ విన్నారే తప్పా వారికి మద్దతుగా వెళ్లలేదు. తమకు సపోర్టుగా రావాలని బీజేపీ సభ్యులను గులాబీ పార్టీ కోరలేదు. ఎందుకంటే ఆ పార్టీ మద్దతు కోరతే, ఆ రెండు పార్టీల మధ్య స్నేహం ఉందని విమర్శలు నిజం అవుతాయనే కారణంతో మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
Read More..
CM Revanth: సీఎం రేవంత్ క్లాస్ వర్కవుట్.. నేతల మధ్య కుదిరిన కో-ఆర్డినేషన్
LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్