- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anushka Shetty: ‘ఘాటి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. షాకింగ్ పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచిన మేకర్స్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు అనుష్క క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటి’(Ghaati) మూవీ చేస్తుంది. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్(First Frame Entertainments) బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఘాటి’ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన గ్లింప్స్, ప్రీ-లుక్(Glimpse, pre-look) పోస్టర్ భారీ రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఘాటి’(Ghaati) విడుదల తేదీ ప్రకటిస్తూ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్స్‌లోకి రాబోతుందంటూ రక్తంతో తడిసిపోయి కోపంగా చూస్తున్న అనుష్క శెట్టి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె బ్లాక్ కలర్ చీర కట్టుకొని మెడలో నల్లపూసల గొలుసు ధరించి ముక్కుపుల్ల, చేతిలో గన్ పట్టుకొని కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు లుక్ చూస్తూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు.