- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: రాహుల్‌జీ ఇదేనా మీ వ్యూహం! ఎక్స్‌లో కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఈ మేరకు ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆదివారం ట్విట్టర్ (ఎక్స్) ద్వారా షేర్ చేశారు.డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి.. తనలాగే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని భావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు.
ఓ ప్రభుత్వ స్కీమ్ ద్వారా తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు జైలుకు పంపిస్తానని ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన సీఎక్స్‌ఓను బహిరంగంగా, నిర్మొహమాటంగా బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి పనికిమాలిన ప్రకటనలతో ఇండస్ట్రీ వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని నిలదీశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదేనా మీరు అనుసరిస్తున్న వ్యూహమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జీ అంటూ ట్యాగ్ చేశారు.