- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పండుగ వాతావరణంలో సన్న బియ్యం పంపిణీ చేయాలి.. : సూర్యాపేట కలెక్టర్

దిశ, సూర్యాపేట : రేషన్ షాప్ లలో మామిడి తోరణాలు,పూల దండలు కట్టి పండుగ వాతావరణం లో సన్న బియ్యం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సన్న బియ్యం పంపిణీ గురించి రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఏప్రిల్ 1 నుండి ప్రతి రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ చేయాలని సూచించారు.
సూర్యాపేట రైతులు పండించిన పంట మిల్లులో మర ఆడించి సన్నబియ్యం ను సూర్యాపేట పేదలకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని గతంలో తినడానికి ఆహారం లేక ఇతర దేశాల నుండి మనం ధాన్యాలు దిగుమతి చేసుకున్నాం కానీ నేడు మన జిల్లా నుండి 10 నుండి 15 రకాల సన్న దొడ్డు రకం వడ్లను పండించి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఇది విప్లవాత్మక మార్పు అని కలెక్టర్ అన్నారు.
ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేసి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం ఇస్తుందని ఎట్టి పరిస్థితుల్లో సన్నబియ్యం స్థానం లో దొడ్డు బియ్యం ఇవ్వకూడదని సన్నబియ్యం FRK(పోర్ట్ పైడ్ రైస్ కేరల్స్) పోషకాలతో కూడిన గుళికలు ఉంటాయని అవి ప్లాస్టిక్ బియ్యం కావని ప్రజలకి డీలర్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ -పాస్ మిషన్ ద్వారా రేషన్ కార్డు లో ఎంత మంది ఉంటే అంత మందికి మనిషికి 6 కేజీ ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని, తూకంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు.ఏప్రిల్ 1 వ తేదీన జిల్లాలోని 610 షాప్ లు తప్పకుండా ఉదయం 8 గంటల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకోవాలని రేషన్ షాప్ లను సివిల్ సప్లై అధికారులు పరిశీలించాలని, ఈ పాస్ మిషన్ లో ఏమైనా సమస్య ఏర్పడితే పై అధికారులకి తెలియపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రాంబాబు,డి ఎస్ ఓ రాజేశ్వర్, డి ఎం ప్రసాద్, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్ లు, డి టి లు, రేషన్ డీలర్ల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.