- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం
by Kalyani |
X
దిశ మహబూబ్ నగర్/వనపర్తి/ఐజ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం జరిగిన మూడు వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు దుర్మరణం చెందగా. కొంతమంది గాయాలపాలయ్యారు. మహబూబ్ నగర్ మండలం తెలుగుగూడెం వద్ద కర్ణాటక బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో మణికొండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాము, ఈర్ల గణేష్ మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం.
వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నాగవరంలో జరిగిన ఫంక్షన్ కు హాజరై మోటార్ సైకిల్ పై తిరిగి వస్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు రజిత, కురుమయ్యలు అక్కడికక్కడే మరణించగా వారి ఆరు సంవత్సరాల కూతురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పర్డిపూర్ గ్రామ సమీపంలో ఆటో, టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఒ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం.
Advertisement
Next Story