మద్యానికి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు అరెస్ట్​

by Sathputhe Rajesh |
మద్యానికి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు అరెస్ట్​
X

దిశ, చార్మినార్ : పార్కింగ్​ చేసిన ద్విచక్రవాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు పాతనేరస్థులను శాలిబండా పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండా పోలీస్​స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలక్‌నుమా డివిజన్​ ఏసీపీ షేక్​ జహంగీర్​, శాలిబండా ఇన్‌స్పెక్టర్ కిషన్​, డిటెక్టివ్​ ఇన్‌స్పెక్టర్​ మునావర్​ షరీఫ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం శాలిబండాలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మునవార్ షరీఫ్ , సబ్ ఇన్స్పెక్టర్ హసిన , వేణుగోపాల్ , వికాస్ క్రైం సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

బిలాల్​నగర్​కాలాపత్తర్‌కు చెందిన మొహమ్మద్​ ఇమ్రాన్​ ఖురేషి అలియాస్​ ఇమ్రాన్​ (40) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్​, ముస్తఫా నగర్‌కు చెందిన మొహమ్మద్​ బాబా (52) లు మద్యం, కల్లుకు బానిసయ్యారు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో పార్కింగ్​చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి, సొమ్ము చేసుకుందామని పక్కా స్కెచ్​ వేశారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటి వరకు ఐదు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ. 2.10లక్షల విలువ చేసే 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని మొహమ్మద్​ఇమ్రాన్​ ఖురేషి , మొహమ్మద్​ బాబాలను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును శాలిబండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story