Basara Godavari : గోదావరిలో దిగి ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం.. తండ్రి, కూతురు మృతి..

by Sumithra |   ( Updated:2024-11-06 09:03:39.0  )
Basara Godavari : గోదావరిలో దిగి ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం.. తండ్రి, కూతురు మృతి..
X

దిశ, బాసర : అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం బలైంది. పూర్తి వివరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకునే ఒక కుటుంబం అప్పుల వాళ్ళ వేధింపులకు తాళలేక తనువు చాలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగాను బుధవారం బాసర గోదావరికి కుటుంబ సమేతంగా చేరుకొని మొదటి ఘాట్ వద్ద గోదావరిలో దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే తండ్రి కూతురు గల్లంతవగా అక్కడ ఉన్న స్థానికులు తల్లిని కాపాడారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ లో ఉప్పలించి వేణు, అతని భార్య అనురాధ, కూతురు పూర్ణిమ నివాసం ఉంటున్నారు. గంజ్ మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తులైన రోషన్, వికాస్ ల దగ్గర సుమారు 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. చక్రవడ్డీ వేసి అప్పు కట్టమని లేకుంటే వయసున్న నీ కూతురు సంగతి తెలుస్తామని, ఇంటికి మనుషులను పంపి ఆడవాళ్ళను అవివస్త్రలను చేస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఆత్మహత్యకు తెగబడ్డామని బాధితురాలు అనురాధ సంఘటన స్థలం వద్ద చేరుకున్న పోలీసులకు తెలిపారు. ఎస్ఐ మహేష్ సీఐ మల్లేష్ సంఘటన వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story